కోటమిట్ట లో పుచ్చలపల్లి సుందరయ్య 34 వ వర్ధంతి

0
166

Times of Nellore (Nellore) #కోట సునీల్ కుమార్ #   – కమ్యూనిస్ట్ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 34 వ వర్ధంతి సందర్బంగా సీపీఎం ఆధ్వర్యంలో కోటమిట్ట సెంటర్ లో వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం కోటమిట్ట శాఖ కార్యదర్శి హుమాయూన్ మాట్లాడుతూ.. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య రాష్ట్రానికి, దేశానికీ ఎనలేని సేవలందించారన్నారు. మాజీ కార్యదర్శి గఫార్ మాట్లాడుతూ, లౌకిక వాడి అయినా కామ్రేడ్ సుందరయ్య మన నెల్లూరీయుడు కావడం మనకెంతో గర్వకారణమన్నారు. ఈ సందర్బంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి రమేష్ , మస్తాన్ బీ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY