మానసిక దివ్యాంగులకు అండగా ఉంటాం – పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి

0
194

Times of Nellore ( Gudur ) – మానసిక దివ్యాంగుల అండగా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఉంటుందని పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. బుధవారం గూడూరు పట్టణం పట్టణంలో గమల్లపాలెం వీధికి చెందిన మానసిక దివ్యాంగుడు రమేష్ గాంధీకి 20 వేల రూపాయల ఆర్థిక సాయం పేర్నాటి శ్యాంప్రసాద్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రమేష్ పరిస్థితి ఇటీవలే తనకు తెలిసిందని తెలిపారు. ఇలాంటివారికి తనవంతు సాయం చేస్తానని తెలిపారు. మీడియా ప్రతినిధులు దృష్టికి ఇలాంటివారు తారసపడితే తనకు తెలియజేస్తే తనవంతు సాయం అందజేస్తామన్నారు. ఆయన వెంట వైసిపి నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, కిషోర్ రెడ్డి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY