నవయువ సేన ఆధ్వర్యంలో ముస్లింలకు ఫలసరుకులు పంపిణీ

0
151

Times of Nellore ( Gudur ) – నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం దర్గా వీధిలోని షాదిమంజిల్ లో నవయువ సేన ఆధ్వర్యంలో ముస్లింలకు ఫల సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ నెట్వర్క్ అధ్యక్షుడు రహీం మహమ్మదీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగను ముస్లింలు అందరూ సంతోషంగా జరుపుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం శుభపరిణామమన్నారు. నవ యువ సేన స్వచ్ఛంద సంస్థను ఆదర్శంగా తీసుకుని యువత సేవ కార్యక్రమ కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్, చంద్ర నీల్, రాహుల్, జిలాని , నిస్సార్, దావూద్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY