పారిశుధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – రూప్ కుమార్

0
274

Times of Nellore ( Nellore ) – పారిశుధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ పి. రూప్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలోని డిప్యూటీ మేయర్ ఛాంబర్ నందు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ పి. రూప్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతు.. పారిశుధ్య కార్మికుల సమ్మెవల్ల ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన మేయర్ ఊర్లు తిరుగుతున్నారని, ఓట్లు వేసి గెలిపించి మేయర్ సీట్లు కూర్చోబెట్టిన ప్రజల సమస్యలు పట్టించుకోకుండా తిరగడం మంచి పద్దతి కాదన్నారు. నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి నారాయణ పారిశుధ్య కార్మికులు వారం రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఇంతవరకు ఎందుకు సమ్మె చేస్తున్నారని, మీ సమస్యలేమిటి అని వారి గురించి ఆలోచన రాకపోవడం దారుణమన్నారు. ఒక వైపు నెల్లూరు నగరమంతా కంపు కొడుతుంటే టిడిపి నాయకులు ఏ ఒక్కరైన సమ్మె చేస్తున్న కార్మికులవైపు కన్నెత్తి కూడా చూడకపోవడం సిగ్గుచేటన్నారు. నగరంలో ఎక్కడి చెత్త అక్కడే ఉడడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, రోగాల బారిన పడుతున్నారని, వెంటనే పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేయర్ కు సూచించారు. గతంలో నెల్లూరు నగర కార్పొరేషన్ లో పాలించిన ప్రతిఒక్కరూ అన్ని పార్లీలవారిని కూర్చోబెట్టి అనేక సమస్యలను పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయని, కాని ప్రస్తుతం ఒంటెద్దుపోకడం ఎందుకు అవలంబిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైన మంత్రి నారాయణ, మేయర్ లు పారిశుధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గోగుల నాగరాజు, ఎండీ. ఖలీల్ అహ్మద్, వేలూరు సుధారాణి, నాయకులు వేలూరు మహేష్, వందవాశి రంగా, కుంచాల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY