విశాలాక్షి సాహిత్య మాసపత్రిక, మక్కెన రామసుబ్బయ్య స్మారక కథ, కవితా బహుమతుల ప్రధానోత్సవ సదస్సు

0
334

Times of Nellore (Nellore) #కోట సునీల్ కుమార్ # – మే 19 , ఆదివారం సాయంత్రం నెల్లూరు పురమందిరం లో విశాలాక్షి సాహిత్య మాసపత్రిక, మక్కెన రామసుబ్బయ్య స్మారక కథ, కవితా బహుమతుల ప్రధానోత్సవ సదస్సు నిర్వహిస్తున్నామని సభ నిర్వాహకులు, ఏ పి ప్రభుత్వ నాటకరంగ సభ్యులు దోర్నాల హరిబాబు తెలిపారు . సభాధ్యక్షులుగా నెల్లూరు జిల్లా 25 కళాసంఘాల కన్వీనర్ అమరావతి కృష్ణారెడ్డి, విశిష్ట అతిధిగా ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు శాఖ కన్వీనర్ కె శివారెడ్డి, ముఖ్య అతిధిగా ప్రముఖ కధారచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ఆర్ ఎం ఉమామహేశ్వర రావు, ఆత్మీయ అతిధులుగా ప్రముఖ రచయిత డా. మక్కెన శ్రీను, ప్రముఖ కవి అడిగోపుల వెంకటరత్నం పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాలాక్షి విశిష్ట పురస్కారం, విశాలాక్షి సాహిత్య పురస్కారాలు, అందజేస్తామన్నారు. విశాలాక్షి , మక్కెన రామసుబ్బయ్య స్మారక కధల పోటీలు, విశాలాక్షి సాహిత్య మాసపత్రిక కవితల పోటీలలో విజేతలకు నగదు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు.
కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, సాహిత్యాభిలాషులు, కవులు, కళాకారుల పాల్గొని జయప్రదం చేయవలసిందిగా హరిబాబు కోరారు.

SHARE

LEAVE A REPLY