సింహపురి హాస్పిటల్ పై చర్యలు తీసుకోండి : ప్రజాసంఘాల ఐక్య వేదిక

0
192

Times of Nellore (Nellore) #కోట సునీల్ కుమార్ #  అవయవదానం పేరుతొ దగా చేసిన నెల్లూరు సింహపురి హిస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని, బాద్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పెంచలయ్య డిమాండ్ చేసారు. నెల్లూరు లోని వెన్నెలకంటి రాఘవయ్య భావం లో మంగళవారం ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సింహపురి హాస్పిటల్ ను కాపాడాలని చూస్తున్న డి ఎం హెచ్ ఓ వర సుందరం పై చర్యలు తీసుకోవాలని పెంచలయ్య డిమాండ్ చేసారు. అలాగే ఇకోలి శ్రీనివాసులు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవడం లో కాలయాపన కు నిరసనగా ఈ నెల 16 వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలు ప్రజాసంఘాల ప్రసతినిధులు, ఏకోళ్ళు శ్రీనివాసులు భార్య అరుణ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY