పొనకా కనకమ్మ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి

0
292

Times of Nellore (Nellore) – నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీద్ధర్ రెడ్డి ఆధ్వర్యంలో పొనకా కనకమ్మ జయంతి సభ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా మహిళా విభాగం అద్యక్ష్యురాలు మెయిళ్ల గౌరీ నిర్వహించారు. ఏఈ సందర్బంగా మెయిళ్ల గౌరీ మాట్లాడుతూ… భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహానుభావులు ఎనలేని సేవలందించారని అలాంటో వారిలో జాతీయ ఖ్యాతి పొందిన తెలుగు రాష్ట్రాల తోలి మహిళా పోరాట యోధురాలు నెల్లూరు జిల్లాకు చెందిన పొనకా కనకమ్మ అని అన్నారు. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పొనకా కనకమ్మ కాంస్య విగ్రహ ఏర్పాటుకు పోరాటం చేస్తున్నారని, కనకమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశం లో చేర్చాలని అన్నారు. ఈ కార్య క్రమంలో కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ సింహపురి ఐక్య వేదిక కో-కన్వీనర్ వసుంధరాదేవి, నగర మహిళా అధ్యక్ష్యురాలు తోట శోభారాణి, తిప్పిరెడ్డి మమతా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY