నేటి నుంచి పాలీసెట్‌ కౌన్సెలింగ్‌

0
367

Times of Nellore ( Nellore ) – పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పాలీ సెట్‌ కౌన్సెలింగ్‌ గురువారం ప్రారంభం కానుంది.ఇందుకోసం వెంకటేశ్వర పురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్‌ కాళాశాల, దర్గామిట్టలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్స్‌లో జరగనుంది. ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతుంది. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారి ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్‌కు ఎప్పుడు హాజరుకావాలో అభ్యర్థులకు తెలియజేశారు. కౌన్సెలింగ్‌లో ఎటువంటి ఆందోళన చెందనవసరంలేదని కన్వినర్‌ రామ్‌మోహన్‌ రావు పేర్కొన్నారు. తప్పులు చేస్తే మరోసారి అవకాశం ఉంటుందని, ఆప్షన్లకు సంబంధించిన విషయాలు శ్రద్దగా వినాలని తెలిపారు.ఏ కళాశాలలో ఏఏ బ్రాంచ్‌లు ఉన్నాయో తెలుసుకొని వారికి నచ్చిన కళాశాల, బ్రాంచి ఎంపిక చేసుకోవాలని సూచించారు.
అవగాహనా కేంద్రాలు

కౌన్సెలింగ్‌కు హాజరు కానున్న విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నగరంలోని వెంకటేశ్వరపురం, దర్గామిట్టల్లోని ప్రభుత్వ బాలుర, మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో నేతాజీ ఫైలెట్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో అవగాహనా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆ పాఠశాల కరస్పాండెంట్‌ నేతాజీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

SHARE

LEAVE A REPLY