కోడిపందాల స్థావరాలపై… దాడులు !

0
301

Times of Nellore (నెల్లూరుజిల్లా)# కోట సునీల్ కుమార్ # : వెంకటగిరి రూరల్ మండలం, కలపాడు గ్రామ పరిసరాల్లో… కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో… 14 మంది నిందితులను అరెస్టు చేయగా, 10 ద్విచక్ర వాహనాలు, 4 పందెంకోళ్లు, 20 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా… వెంకటగిరి ఎస్.ఐ. కొండప్పనాయుడు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగల నేపథ్యంలో… చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్న తమకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలందరూ కోడిపందాలు, పేకాట వంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడకుండా, సంతోషంగా పండుగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

SHARE

LEAVE A REPLY