ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలి – మాజి మేయర్ అబ్దుల్ అజిజ్

0
161

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- మాజి మేయర్ అబ్దుల్ అజిజ్ నెల్లూరు ప్రజలందరికీ శ్రీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తరిమి కొట్టేందుకు 21 రోజుల లాక్ డౌన్ చేయడం జరిగిందని, దీనిని ప్రజలందరూ దృష్టిలో ఉంచుకొని ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు. అలాగే ముస్లిం సోదరులు మోడీ మీద ఉన్న ద్వేషంతో దీనిని ఉల్లంగించకూడదని ఇది మోదీ నిర్ణయం కాదు (who) వరల్డ్ హెల్త్ ఆర్గనైజషణ్ తీసుకున్న నిర్ణయం అని తెలియజేసారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లలో నుంచి బయటకి రాకుందా ఉండాలని అదేముంది లే అని అనుకోకండి అని ఆయన ప్రజలకు సూచించారు. ఒక వేల పక్క దేశాలలో లాగా ఆ మహమ్మారి విజృంభిస్తే మన దేశ జనాభా దృష్ట్యా దాన్ని ఆపడం కొంచెం కష్టంగా ఉంటుందని అందువలన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు

SHARE

LEAVE A REPLY