మానసిక వికలాంగుల పట్ల జాలి చూపండి – జడ్జి పి.జె.సుధ

0
209

Times of Nellore ( Nellore ) – మానసిక వైకల్యంతో బాధపడేవారి పట్ల ప్రజలు జాలి చూపాలని, వారిపై దాడులు చేయడం సరికాదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి పి.జె.సుధ అన్నారు. మానసిక వికలాంగులు, రోడ్లపై పిచ్చివారిగా తిరిగే వాళ్లపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి హక్కుల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నంబర్ 1, జీవో నంబర్ 13 అనే చట్టాన్ని 2017లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా నెల్లూరు నగరంలో ఈ రోజు స్పెషల్ డ్రైవ్ తీసుకుని మానసికంగా బాధపడుతూ సంచరిస్తున్న వారిని గుర్తించి వారికి సరైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమ సంస్థ ప్రతినిధులతో కలసి నెల్లూరు నగరంలోని నలుగురు పిచ్చివాళ్లను గుర్తించి వారిలో ఇద్దర్ని 108వాహనంలో తీసుకొచ్చి నెల్లూరు పెద్దాసుపత్రిలో చేర్పించామని, మరో ఇద్దర్ని వైజాగ్ పిచ్చాసుపత్రికి తరలిస్తున్నామని తెలిపారు. ఇటువంటి వారి పట్ల పౌరులు కూడా బాధ్యత గా స్పందించి వారి వివరాలను పోలీసులకు తెలుపవలసిందిగా కోరుతున్నామన్నారు.

SHARE

LEAVE A REPLY