పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత- ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి !!

0
37

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండల కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా పర్యావరణ పరిరక్షణ మరియు చైతన్యతా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షించుకునేందుకు ప్లాస్టిక్ సంచులను నిషేధించి, గుడ్డ సంచులను వాడాలని ఆయన సూచించారు. జిల్లా థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల కాలుష్యం కోరలు చెందడంతో, వీలైన చెట్లు పెంచి పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలు కేవలం చదువులకే పరిమితం కాకుండా, సామాజిక అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి పాటుపడాలన్నారు.

SHARE

LEAVE A REPLY