చిల్లకూరు మండలం లో జిల్లా కలెక్టర్ కస్మిక పర్యటన!!

0
57

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం లో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ఆకస్మిక పర్యటన చేపట్టారు .ముందుగా లింగవరం గ్రామానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 25న అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు చెందిన గ్రామ రెవెన్యూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గూడూరు డివిజన్ పరిధిలో లబ్ధిదారుల సంఖ్య మొత్తం అడిగి ఆరాతీశారు, అనంతర చెన్నై- బెంగుళూరు కోస్టల్ కారిడార్ భూములకు సంబంధించి గ్రామ పటాన్ని , భూములను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు, అనంతరం మోమిడి గ్రామ సచివాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరుపై అరా తీశారు…ఆయన వెంట గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ఉన్నారు…

SHARE

LEAVE A REPLY