జర్నలిస్టు కాలనీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి !!

0
59

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులో 25 లక్షల రూపాయల వ్యవయంతో జర్నలిస్టు కాలనీ రోడ్డు పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, 31 మరియు డివిజన్ లో అభివృద్ధి పనులకు ఇప్పటికే 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కొత్తూరు జర్నలిస్టు కాలనీకి నా పేరు వద్ద జాతీయ నాయకుల పేర్లు పెట్టండని అన్నారు. ఎందరో ప్రముఖులున్నారని మరియు పత్రికా రంగంలో రాణించిన వారు ఉన్నారని, అలాగే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు కూడా పెట్టాలన్నారు. తన పేరు జర్నలిస్టు కాలనీకి వద్దని, నా మీద అభిమానంతో జర్నలిస్టు కాలనీకి తన పేరు పెట్టాలని సూచించిన జర్నలిస్టు సోదరులందరికి ఋణపడి ఉంటానన్నారు. అతి తక్కువ కాలంలో కొత్తూరు శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కొత్తూరు చక్కటి వేదిక కాబోతుందని రూరల్ ఎం.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తగాదాలు లేకుండా మంచికి మారు పేరుగా కొత్తూరు నిలుస్తుందని అన్నారు. ఇక్కడ స్థలాలు తక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లల చదువులకోసం – నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తూరు ప్రాంతానికి వలసలు వస్తున్నారన్నారు. వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ లో కొత్తూరు అభివృద్ధికి 5 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

SHARE

LEAVE A REPLY