శ్రీ ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ గా ఒట్టూరు సుధాకర్ యాదవ్

0
153

Times of Nellore (Nellore)  # కోట సునీల్ కుమార్ #- శ్రీ ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ గా ఒట్టూరు సుధాకర్ యాదవ్ ను ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ పరిశీలకులు ఆర్ కృష్ణ చైతన్య దేవస్థానం ఈవో వేమూరి గోపి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. దేవస్థానం చైర్మన్ గా సుధాకర్ యాదవ్ పేరును సభ్యుడు ఉచూరు సురేష్ ప్రతిపాదించగా మిగిలిన సభ్యులు పిట్ల వెంకటేశ్వర్లు, వండ్రంగి వెంకటేశ్వర్లు, చెన్నారెడ్డి విజయమ్మ, క ట్లూరు చంద్రశేఖర్ రెడ్డి, పావురాల రమేష్ ,ఎక్స్ అఫిషియో సభ్యుడు పులి కొలను చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఆమోదించారు, ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు కోడూరు కమలాక రెడ్డి ,ఖాజావలి, శ్రీనివాసులు, స్వర్ణ వెంకయ్య, పాముల హరి, తదితరులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY