నెల్లూరుజిల్లాలో రెండు రోజులు కరెంటు బంద్

0
2905

Times of Nellore ( Nellore ) – నెల్లూరు నగరశివారు కొత్తూరు అంబాపురం వద్ద ఉన్న 220 కేవి సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ లైన్ల ఆధునీకరణ పనులు చేపడుతున్న నేపద్యంలో జిల్లా మొత్తం శనివారం, ఆదివారం రెండు రోజులు విద్యుత్ ను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పూర్తిగా జిల్లా మొత్తంగా విద్యుత్ ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం మాత్రం నెల్లూరు నగరానికి మినహాయింపునిచ్చారు.

విద్యుత్ అధికారులపై సర్వత్రా విమర్శలు
మరో వైపు విద్యుత్ శాఖ అధికారుల తీరుపై అన్నీ వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ లైను ఆధునీకరణకు జిల్లా మొత్తం రెండు రోజులు విద్యుత్ ను నిలిపివేయాలా అని ప్రశ్నిస్తున్నారు. పగటి పూటంతా కరెంటు లేకపోతే పరిస్థితి ఏంటని జనం భయపడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా పూర్తిగా విద్యుత్ నిలిపివేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వ్యాపార వర్గాల వారు కూడా దీనిపై మండిపడుతున్నారు. గంట రెండు గంటలైతే జనరేటర్లను వాడుకోవచ్చునని, ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకంటే ఎలాగని ఆవేదన వ్యక్తం చేశారు.మంచినీటి సరఫరాకు కూడా అంతరాయం కలగనున్న నేపద్యంలో జనం ఇదేంటని అంటున్నారు. ఈ రెండు రోజులు పరిశ్రమలు మూసుకోవాల్సిందేనని పారిశ్రామిక వర్గాల వారు ఆవేదన చెందుతున్నారు. అన్నీ వర్గాల వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.

SHARE

LEAVE A REPLY