నెల్లూరు జిల్లాలో మూడు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించడం దేశచరిత్రలోనే రికార్డు!!

0
45

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణ విషయంలో అక్రమాలు జరిగాయన్న మాజీమంత్రి సోమిరెడ్డి ఆరోపణలపై విచారణ జరపాలని ఎస్పీని ఆదేశించామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇంకా అధికారంలో ఉన్నట్లు సోమిరెడ్డి వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా అభివృద్దిపై విస్తృత స్థాయిలో సమీక్ష జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో కొన్ని సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు వినతిపత్రాలు అందచేశారని, వీటిని కూడా తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.గతంలో ఎన్నడూ లేనంతగా నెల్లూరు జిల్లాలో మూడు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించడం దేశచరిత్రలోనే రికార్డు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో నిజమైన ప్రజాసేవ చేస్తూ వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగం అప్రమత్తంగా వుండడం వల్ల సత్ఫలితాలు సాధించగలుగుతున్నామని అన్నారు. ఇలాంటి సమయంలో కూడా టీడీపీ నేతలు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

SHARE

LEAVE A REPLY