అపోలో లో అత్యాధునిక పురిటిబిడ్డ‌ల ఐసియు – చిన్న‌పిల్లల విభాగాధిప‌తి డా. రూప

0
541

Times of Nellore ( Nellore ) – వైద్య‌రంగంలో అత్యాధునిక సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు నిల‌బెడుతూ, పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు కార్పోరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చిన నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్ వైద్యులు ఎంతో శ్ర‌మించి, ఓ పురిటిబిడ్డ ప్రాణం కాపాడారు. వివ‌రాల్లోకి వెళ్తే, నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో హాస్పిట‌ల్ చిన్న‌పిల్లల విభాగాధిప‌తి  డాక్ట‌ర్ రూప మాట్లాడుతూ.. గూడూరులో షుగరుతో ఉన్న ఓ గ‌ర్భ‌స్థ మ‌హిళ‌కు ఉమ్మ‌నీరు పడిపోవడంతో 6వ‌ నెల నిండ‌కుండానే,  బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింద‌ని తెలిపారు. ఆ మ‌హిళ ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో గూడూరులోని ఓ ప్రైవేట్ వైద్య‌శాల‌లో సిజేరియ‌న్ ఆప‌రేష‌న్ ద్వారా బిడ్డ‌ను బ‌య‌ట‌కు తీయడం జ‌రిగింద‌ని చెప్పారు. అయితే ఆ బిడ్డ నెల‌లు త‌క్కువ‌గా, బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌టంతో, వెంట‌నే అపోలో వైద్యుల సూచ‌న‌ల‌తో త‌ల్లిదండ్రులు పురిటిబిడ్డ‌ను, నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌కు చెందిన ప్ర‌త్యేక అంబులెన్స్‌లో త‌ర‌లించార‌ని ఆమె చెప్పారు. ఆ సమయంలో పురిటి బిడ్డ 800 గ్రాముల బరువు మాత్రమే ఉన్నదని తెలిపారు. వెంట‌నే ఆ పురిటి బిడ్డ‌ను ఎన్‌.ఐ.సి.యులో అడ్మిన్ చేసుకున్నామ‌ని అన్నారు. బ‌రువు త‌క్కువ‌గా, 6నెల కంటే ముందుగానే పుట్టిన ఆ బిడ్డ‌కు ఊప‌రితిత్తులు విచ్చుకోలేదని, దీనిని గ‌మ‌నించిన తాము, కృత్రిమ శ్వాస‌తోపాటూ, బొడ్డుతాడు ద్వారా ఆహారప‌దార్థాలు అందించి, ప్రాణాలు నిల‌బెట్టామ‌ని వెల్లడించారు.

7వారాల చికిత్స అనంత‌రం ఆ పురిటిబిడ్డ‌ను ఎన్‌.ఐ. సి.యూ నుంచి డిస్ చార్జ్ చేస్తున్న‌ట్లు డాక్ట‌ర్ రూప స్ప‌ష్టం చేశారు. డిస్ చార్జ్ సమయంలో బిడ్డ 1.2 కేజీల బరువుతో ఉన్నదని తెలిపారు. అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో ఉన్న అత్యాధునిక వైద్య ప‌రిక‌రాలు, అత్యాధుని వైద్య సేవలు, నిపుణులైన వైద్యుల‌తో, బ‌రువు, నెల‌లు త‌క్కువ ఉన్న పురిటిబిడ్డ‌ల‌ను కాపాడుగ‌లుగుతున్న‌ట్లు డాక్ట‌ర్ రూప స్ప‌ష్టం చేశారు. గ‌తంలో కూడా తాము 600 గ్రాములతో బ‌రువు త‌క్కువ ఉన్న బిడ్డ‌కు చికిత్స అందించి, ప్రాణాలు నిల‌బెట్టిన‌ట్లు గుర్తు చేశారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో అత్యాధునిక పురిటిబిడ్డ‌ల చికిత్స కేంద్రంతో పాటు 24 గంటలు అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంద‌ని, ఈ అవ‌కాశాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నించి, స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ విలేక‌ర్ల స‌మావేశంలో ఆసుపత్రి మెడికల్ సూప‌రిండెంట్ డాక్ట‌ర్ శ్వేత‌, యూనిట్ హెడ్ న‌వీన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY