ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ఆర్.ఓ ప్లాంట్ లు ప్రారంభం

0
201

Times Of Nellore ( Nellore ) – నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఐ.పి విభాగం నందు ఆర్.ఓ ప్లాంట్ ను సరిచేసి ప్రారంభించడమైనది. కొత్తగా ఏర్పాటు చేసిన 4వేల లీటర్ల క్యాపాసిటీ గల రెండు ఆర్.ఓ ప్లాంట్ లను హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చాట్ల నరసింహరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ ద్వారా వచ్చే మినరల్ వాటర్ 5 అంతస్థుల ఐపి విభాగాలలో ఒక్కొక అంతస్థులలో ఆరు కూలర్ల చప్పున మొత్తం 30 కూలర్లు పేషంట్లు, వారి సహయకుల సౌకర్యం కోసం ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సమ్యేలో ఉన్నందున 80 మంది డాక్టర్లు వారి సేవలను నిలిపివేశారు. రెగ్యులర్ గా ఉన్న డాక్టర్లు 62 మందిలో 17 మంది సెలవలో ఉన్నారు. ప్రస్తుతం 45 మంది మాత్రమే హాజరైనారు. ముఖ్యంగా ప్రసూతి, చిన్న పిల్లల విభాగంలో తీవ్రమైన డాక్టర్ల కొరత ఉంది. ప్రభుత్వం వెంటనే వైద్యసేవలు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎమ్.ఓ డా. వరప్రసాద్, అడ్మీనిష్ట్రేటర్ కళారాణి, సభ్యులు బి.వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY