ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ – జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటన

0
834

జూలై 05 ( నెల్లూరు ) – ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ జరిగేలా అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలోని ఈద్గా కమిటి నిర్వహకులు ఎస్పీని కలిసి రంజాన్ ప్రార్ధనల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్పీ వారితో మాట్లాడారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో జరిగే ప్రార్ధనల్లో 20వేల మంది వరకూ పాల్గొంటారని వారు ఎస్పీకి తెలియజేశారు. రంజాన్ పండుగ నేపద్యంలో దర్గా వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి,సీసీ టీవీ కెమరాలు కూడా అమర్చుతామని వెల్లడించారు. జిల్లా ప్రజలకు ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

SHARE

LEAVE A REPLY