అభివృద్ధి, సమస్యలపై కమీషనర్ ను కలిసిన నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

0
601

Times of Nellore ( Nellore ) – నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించేందుకు నెల్లూరురూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇవాళ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఢిల్లీరావును కలిశారు. వైసిపి కార్పొరేటర్లతో కలిసి ఆయన కమీషనర్ ఛాంబర్ కు వెళ్లి సుమారు గంటపాటూ వివిధ అంశాలపై మాట్లాడారు. పొట్టేపాళెం కలుజు వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, దాని విషయంలో టెండర్లు కాకుండా నామినేషన్ పద్దతిలో పనులు చేయించాలని కమీషనర్ ను కోరారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని అనేక ప్రాంతాలు దాహార్తితో అల్లాడిపోతున్నాయని, యుద్ధ ప్రాదిపదికన బోర్లు వేయించాలని విజ్ఞప్తి చేశారు. చిల్డ్రన్స్ పార్కు వద్ద మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని దానిపై దృష్ఠి సారించాలన్నారు. పొదలకూరురోడ్డులోని నేతాజినగర్ వద్ద ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలం డంపింగ్ యార్డుగా మారి, దుర్వాసన వెదజల్లుతుందని దీని కారణంగా స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారని వివరించారు. అధికారులు అనుమతిస్తే ఆ స్థలాన్ని స్థానికులు శుభ్రం చేసుకుని, కార్పొరేషన్ కు పైసా ఖర్చు లేకుండా పార్కును నిర్మించుకుంటారని కమీషనర్ ను కోరగా, పరిశీలిస్తామని బదులిచ్చారు. నియోజకవర్గానికి మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని కోటంరెడ్డి కోరారు.

SHARE

LEAVE A REPLY