నీటి సమస్యను పరిష్కరిస్తాం- రూప్ కుమార్ యాదవ్!

0
77

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒  –నెల్లూరు నగర ప్రజలు దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ అన్నారు.నెల్లూరు నగర తూర్పు ప్రాంత ప్రజలు మంచి నీటి కొరకు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు . నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందన్నారు. ఈ సమస్యను ఇరిగేషన్ శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా సోమశిలకు నీళ్లు తీసుకొస్తున్నామని.. మరో రెండు రోజుల్లో నీటి సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. గతపాలకుల పాపమే నీటి ఎద్దడికి కారణమన్నారు. నగరవాసుల నీటి కష్టాలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

SHARE

LEAVE A REPLY