నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది-ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి!

0
70

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒  –ఎందరో నిరుద్యోగ యువతకు గ్రామ వాలంటీర్లుగా ఉపాధిని కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని కొత్త వెల్లంటి లో మత్స్యకార సొసైటీ సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మత్స్యకార సొసైటీ కి చెందిన 250 మందికి 11,700 చొప్పున ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. అనంతరం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే మొదటిది అని ప్రశంసించారు. దీనివల్ల గ్రామాల్లో ఉపాధి దొరకని ఎందరో యువకులకు మంచి అవకాశం దొరికిందని తెలిపారు.

సీఎం జగన్ పాదయాత్రలో గమనించిన విషయాలను దృష్టిలో ఉంచుకుని పలు సంస్కరణలు ప్రవేశ పెడుతున్నారని తెలిపారు .అందులో ఇది భాగమని చెప్పారు. ఇంకా ఎన్నో సంస్కరణలు అమల్లోకి రానున్నాయని తెలిపారు . చంద్రబాబు పాలనలో ఎప్పుడు కూడా వర్షాలు కురవ లేదని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గాని ప్రస్తుతం జగన్ హయాంలో కానీ వర్షాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి లకు వరదలు వస్తున్నాయని, దీనివల్ల ప్రాజెక్టులు నిండి పంటలు పండే అవకాశం కలిగిందని అన్నారు .శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా మన జిల్లాలోని సోమశిల కు జలాలు రానున్నాయన్నారు . కొత్త వెల్లంటి లో ఐదేళ్లుగా చేపల వేటలో అవక తవకలు జరుగుతున్నాయని ,దానిని సరి చేసిన ఘనత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఇన్చార్జి గిరిధర్ రెడ్డి లకు దక్కుతుందన్నారు .వారి నాయకత్వంలో లో ఇంకా పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని పొందాలని సూచించారు.

ప్రస్తుతం లభించిన మొత్తాన్ని గృహిణులకు ఇచ్చి సద్వినియోగం చేయాలని సూచించారు .మీ సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందు ఉంటామని ,సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి,నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ గిరిధర్ రెడ్డి, స్వర్ణ వెంకయ్య సుధాకర్ రెడ్డి , శ్రీకాంత్ రెడ్డి , నరసింహారావు తదితరులు పాల్గొన్నారు .

SHARE

LEAVE A REPLY