నెల్లూరు బీజేపీ కార్యాల‌యంలో ఘ‌నంగా స్వాతంత్ర్యదినోత్స‌వం

0
701

Times Of Nellore ( Nellore ) – ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోన్న భార‌త‌వ‌ని, నేడు ప్ర‌ప‌పంచ గ‌ర్వించ ద‌గిన స్థాయికి చేరుకోవ‌డం చాలా సంతోష‌క‌ర‌మ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి క‌ర్నాటి ఆంజ‌నేయ‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. దేశం ఓ వైపు అభివృద్ధి చెందుతుంటే మ‌రోవైపు కొన్ని శ‌క్తులు దేశ స‌మ‌గ్ర‌త‌ను స‌వాల్ చేస్తుంద‌ని ఆరోపించారు. ఇటువంటి శ‌క్తుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అన్నారు. నెల్లూరులోని బీజేపీ కార్యాల‌యంలో జ‌రిగిన స్వాతంత్ర్య‌దినోత్స‌వ వేడుక‌ల్లో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వ‌న్నెల జెండాను ఆవిష్క‌రించారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి దేశ స‌మ‌గ్ర‌త‌ను కాపాడేందుకు, కృషి చేస్తున్నార‌ని, ప్ర‌ధానికి ప్ర‌జ‌లంతా మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరారు. అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్య‌క్షులు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ భార‌తవ‌నికి స్వాతంత్ర్యం తీసుకువ‌చ్చేందుకు కృషి చేసిన త్యాగ‌ధ‌నుల‌ను ఎన్న‌టికీ మ‌రువ‌లేమ‌ని, 70ఏళ్ల స్వాతంత్ర్య భార‌త‌దేశం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతోంద‌ని తెలిపారు. భార‌త‌దేశం మ‌రింత ముందుకు వెళ్లేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని అన్నారు. జాతీయ భావాలు క‌లిగిన నేత‌లు ప్ర‌స్తుతం దేశాన్ని పాలిస్తున్నార‌ని, వారి నేతృత్వంలో ప్ర‌పంచ‌దేశాలు గ‌ర్వించ‌ద‌గిన స్థాయికి భార‌త‌వ‌ని నిలుస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర అధ్య‌క్షులు ఈశ్వ‌ర‌య్య‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY