సదరన్ క్యాంపును పరిశీలించిన హాస్పిటల్ అభివృద్ధి కమిటి ఛైర్మైన్ చాట్ల

0
469

Times of Nellore ( Nellore ) – నెల్లూరు, దర్గామిట్టలోనున్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ప్రతీ వికలాంగులకు సర్టిఫికేట్లు మంజూరు చేసేందుకు ప్రతి మంగళవారం నిర్వహించే సదరన్ క్యాంపును హాస్పిటల్ అభివృద్ధి కమిటి ఛైర్మైన్ చాట్ల నరసింహారావు పరిశీలించారు. సర్టిఫికేట్ల కోసం అక్కడికి వచ్చిన వికలాంగులతో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సర్టిఫికేట్ల జారీలో జాప్యం లేకుండా చూడాలని అక్కడి సబ్బిందిని ఆదేశించారు. అలాగే వైద్య పరీక్ష కేందాన్ని కూడా ఆయన తనిఖీ చేశారు. వాతావరణంలో మార్పుల నేపద్యంలో జ్వరాలు ప్రభలుతున్నాయని, జ్వరంతో వచ్చే వారికి రక్త పరీక్షలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించి, వారికి తదనుగుణంగా మందులు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం చాట్ల నరసింహారావు మాట్లాడుతూ, ఈ వారం నుండి వికలాంగులకు ఒక రోజు వ్యవధిలోనే సర్టిఫికేట్లు జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ రాధాకృష్ణమరాజు, ఆర్.ఎమ్.ఓ. డాక్టర్ వర ప్రసాద్, అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ కళారాణి, కమిటి సభ్యురాలు బి.వి. లక్ష్మి, డి.వి.ఎస్. గిరి పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY