నెల్లూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రాధాకృష్ణరాజును అరెస్ట్ చేయాలి – బి.జె.వై.యం. నాయకులు

0
324

Times of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని ప్రభుత్వాసుపత్రి నందు విధులు నిర్వర్తించే మహిళా డాక్టర్ టి. మునికుమారి పై లైంగిక వేధింపుల కేసులో ఉన్న సూపరింటెండెంట్ డా. రాధాకృష్ణరాజును వెంటనే అరెస్ట్ చేయాలని బి.జె.వై.యం. జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం నెల్లూరు నగరంలోని స్థానిక వి.ఆర్.సి. సెంటర్ నుండి జిల్లా కలెక్టరు కార్యాలయము వరకు బి.జె.వై.యం. ఆధ్వర్యములో నిరసన ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టరుకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా బి.జె.వై.యం. జిల్లా అధ్యక్షులు మొగరాం సురేష్ బాబు మాట్లాడుతూ.., జూలై 31న నెల్లూరు 4వ నగర పోలీసు స్టేషన్ నందు డా.మునికుమారి ఫిర్యాదు చేసిందులకు గాను ఆమెపై రాధాకృష్ణరాజు రాజకీయ ఒత్తిళ్ళు తీసుకురావడాన్ని ఖండిస్తున్నామన్నారు. తన పై అధికారి వలన ఆందోళనకు గురైన మునికుమారి రాజీనామా చేశారని, దినిని గ్రహించి ఆమెను వెంటనే విధులలోకి తీసుకోవాలని, అలాగే అందుకు కారణమైన రాధాకృష్ణరాజును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమెకు న్యాయం జరగని పక్షంలో ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘ నాయకులను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెడికల్ కళాశాల విద్యార్దులపై, శానిటేషన్ విభాగానికి సంబంధించిన మహిళలపై కూడా లైంగిక వేధింపులు రావడం, అభివృద్ధి కమిటీ రూమ్ లో అశ్లీల కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రజా నాట్యమంటలి వారు తెలిపినట్లు ప్రధాన కార్యదర్శి ఫణిరాజు పేర్కొన్నారు. ఈ విషయాలపై వర్కింగ్ ఛైర్మన్ చాట్ల నరసింహారావు సమాధానం చెప్పాలని, తనకు రాజకీయలే కావాలనుకుంటే హాస్పిటల్ ను విడిచి, రాజీనామా చేసి, ఆసుపత్రి పరువు, ప్రతిష్ట కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమములో అశోక్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ, మల్లికార్జున, మధుసూధన్, రవి, వినయ్, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY