నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది – ఆర్ఐవో బాబూ జాకబ్

0
828

Times of Nellore ( Nellore ) – ఇంటర్ ద్వితియ సంవత్సరం ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు ర్యాంకుల పంట పడింది. ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు, బైపీసీలోను ప్రథమ ర్యాంకును జిల్లా విద్యార్ధులు కైవసం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో పదిలోపు మరో రెండు ర్యాంకులను కైవసం చేసుకున్నారు. మొత్తం మీద రాష్ట్ర స్థాయిలో పది ర్యాంకుల్లోపు నలుగురు విద్యార్థులు నిలిచారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఫలితాలు రాలేదు. రాష్ట్ర స్థాయిలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 2017-2018 విద్యా సంవత్సరంలో 27,802 మంది పరీక్షలు రాయగా వారిలో 21,393 మంది ఉత్తీర్ణులయ్యారు. 77 శాతంతో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని ఆర్ఐవో బాబూ జాకబ్ తెలిపారు.

SHARE

LEAVE A REPLY