పదవీ విరమణ చేసిన నెల్లూరు సిసిఎస్ ఎస్సై – సన్మానించిన ఉన్నతాధికారులు

1
709

Times of Nellore ( Nellore ) – నెల్లూరులోని సెంట్రల్ క్రైం పోలీస్ స్టేషన్ ( సిసిఎస్ )లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్. ఎమ్. బాషా పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది కార్యాలయంలో ఎస్.ఎమ్. బాషాకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పీ ఎమ్. బాలసుందర్ రావు, సిఐ వి. సుధాకర్ రెడ్డి, ఎస్సై హనీఫ్, సుదర్శనరావు, చెంగయ్య, ఏఎస్సై రమేష్, రైటర్ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. అందరూ పదవీ విరమణ చేసిన ఎస్.ఎమ్ బాషాను పూలమాలలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ 40 సంవత్సరాల పాటూ పోలీసు శాఖలో బాషా సమర్ధ వంతంగా విధులు నిర్వహించి, పోలీస్ శాఖకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారని కొనియాడారు. ఆయనకు పదవీ విరమణ కాలం సంతోషంగా గడవాలని కాంక్షించారు.

SHARE

1 COMMENT

LEAVE A REPLY