ఈనెల 24న ఎఫ్.ఎమ్. రేడియో స్టేషన్ కు నెల్లూరులో వెంకయ్య శంఘస్థాపన – వెల్లడించిన బిజేపి నేతలు

0
813

Times of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్ కు ఈనెల 24వ తేదీనా నగరంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శంఖుస్థాపన చేయనున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పి. సురేంద్రరెడ్డి వెల్లడించారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ తో పాటూ నెల్లూరుజిల్లా అభివృద్ధికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈనెల 24, 25 తేదీల్లో వెంకయ్య నెల్లూరులో పర్యటిస్తారని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా ఎఫ్.ఎమ్. రేడియో స్టేషన్, 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఇండోర్ స్టేడియం, అలాగే నెల్లూరులో పార్కుల సుందరీకరణ, స్వర్ణాల చెరువు వద్ద పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంఖుస్థాపనలు చేస్తారని వెల్లడించారు. నాలుగు రాష్ట్రాల్లో బిజేపి అధికారం చేజిక్కుంచుకోవడం చూస్తే 2019లో కూడా కేంద్రంలో బిజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరుజిల్లాలో వ్యవసాయ సాగుకు వీలు కానీ ప్రాంతాల్లో అక్కడి వారికి ఉపాధి హామీ పనులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రైతులు పండించే ధాన్యాన్ని గిట్టుబాటు ధరలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సురేంద్ర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వం కరువు సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. గుజరాజ్ మాదిరిగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వీరితో పాటూ పార్టీ నగర అధ్యక్షులు మండ్ల ఈశ్వరయ్య, కార్యదర్శి రాజేష్, ఎస్సీ మోర్చా నాయకులు బండారు శ్రీనివాసులు, పరశురాం, కాయల మధు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY