బ్యాడ్మింటన్‌ హబ్‌గా నెల్లూరు

0
281

Times of Nellore ( Nellore ) – భవిష్యత్తులో బ్యాడ్మింటన్‌ క్రీడకు నెల్లూరు హబ్‌గా మారుతుందని బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్‌ రాష్ట్రస్థాయి పోటీలు నెల్లూరులోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్‌ స్టేడియంలో కొనసాగుతున్నాయి. 13 జిల్లాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మైదానం అంతా కోలాహలంగా మారింది. అండర్‌ -10, 12, 14 విభాగాల్లో పోటీలు ఉండటంతో చిన్నారులు సైతం పోటీల్లో పాల్గొన్నారు. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులతో మైదానం అంత కళకళలాడింది. శిక్షకులు, నిర్వాహకులతో పోటీల వేదిక ఆకట్టుకుంది. ఆదివారం సెమీఫైనల్స్‌ పోటీలు జరుగుతాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. దాంతో గట్టి పోటీ నెలకొంది. తమ శక్తివంచన లేకుండా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. అక్కడే భోజనాలు చేయడం, పోటీల్లో పాల్గొనడంతో ఒక ప్రత్యేక వాతావరణం ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులందరూ ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉంటున్నారు.

SHARE

LEAVE A REPLY