నెల్లూరు అపోలో హాస్పిటల్ లో న్యూరో సైన్స్ నర్సింగ్ కోర్సు ప్రారంభం

0
1019

Times of Nellore ( Nellore ) – అన‌తికాలంలోనే ఎంతో మంది నిరుపేద‌, మ‌ధ్య‌త‌గ‌ర‌తి ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన వైద్య‌సేవ‌లు అందిస్తూ, అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటున్న నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్ మ‌రో నూత‌న విధానానికి శ్రీ‌కారం చుట్టింది. హాస్పిట‌ల్ న్యూరాల‌జీ విభాగాధిప‌తి డాక్ట‌ర్ బిందు మీన‌న్ నేతృత్వంలో న్యూరో సైన్స్ న‌ర్పింగ్ కోర్సు ప్రారంభమైంది. ఈ కార్య‌క్ర‌మానికి జిల్లా వైద్యాధికారి డాక్ట‌ర్ వ‌ర‌సుంద‌రం ముఖ్య అతిథిగా విచ్చేసి, న్యూరో సైన్స్ న‌ర్సింగ్ కోర్సును ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ న్యూరో సైన్స్ న‌ర్సింగ్ కోర్సుకు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని తెలిపారు. డాక్ట‌ర్ బిందుమీనన్‌, కేవ‌లం వైద్యం అందించ‌డ‌మేకాకుండా, వైద్య విధానాల‌ను పెంపొందించేందుకు, వైద్య రంగం ప‌ట్ల యువ‌త ఆక‌ర్షితుల‌య్యేందుకు ఎంతో కృషి చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. డాక్ట‌ర్ బిందు మీన‌న్ నేతృత్వంలో అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో న్యూరో సైన్స్ న‌ర్సింగ్ కోర్సును ప్రారంభించ‌డం చాలా సంతోష‌దాయ‌మ‌ని అన్నారు. డాక్ట‌ర్ బిందు మీన‌న్ ఆధ్వ‌ర్యంలో భ‌విష్య‌త్తులో మ‌రిన్ని మెడిక‌ల్‌, పారామెడిక‌ల్ కోర్సులు ప్ర‌వేశ‌పెట్ట‌బ‌డాల‌ని, దీని ద్వారా వైద్య‌రంగంలో జ‌రుగుతున్న మార్పును ఎప్ప‌టిక‌ప్పుడు విద్యార్థులు, వైద్యులు అవ‌గాహ‌న పెంచుకునేందుకు వీలు ఉంటుంద‌ని అన్నారు.

అనంత‌రం అపోలో స్పెషాలిటీ న్యూరాల‌జీ విభాగాధిప‌తి, ప్ర‌ముఖ న్యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ బిందు మీన‌న్ మాట్లాడుతూ న‌రాల సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారికి వైద్య‌సేవ‌లందించ‌డంలో న‌ర్సుల పాత్ర ఎంతో కీల‌క‌మైంద‌ని అన్నారు. న్యూరాల‌జీపై పూర్తి అవ‌గాహ‌న క‌లిగిన న‌ర్సులు అందుబాటులో ఉన్న‌ప్పుడు న‌రాల సంబంధిత వ్యాధుల‌కు గురైన వారికి చికిత్స అందించ‌డం సుల‌బ‌త‌ర‌మ‌వుతుంద‌ని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, భ‌విష్య‌త్తులో న్యూరో సైన్స్ న‌ర్సింగ్‌కు ఉన్న ప్రాధ‌న్య‌త‌ను దృష్టిలో ఉంచుకుని ఈకోర్సును ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కోర్సును అభ్య‌సించే వారికి అపోలో హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలో చ‌ర్చ‌లు, ప్రాక్టిక‌ల్స్‌, క్లినిక‌ల్ టీచింగ్‌, ప్రాజెక్ట్ వ‌ర్క్‌ల ద్వారా న్యూరాల‌జీపై అవ‌గాహ‌న పెంపొందించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్ యూనిట్ హెడ్ న‌వీన్ , హాస్పిట‌ల్ మెడిక‌ల్ సూప‌రిండెంట్ డాక్ట‌ర్ శ్వేతారెడ్డి, ప‌లువురు సిబ్బంది పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY