నెల్లూరు 2టౌన్ పోలీస్ స్టేషన్ లో నిషేధిత గుట్కా నిల్వల వ్యాపారస్తులు అరెస్ట్

0
1126

Times of Nellore ( Nellore ) – నెల్లూరులో నిషేధిత గుట్కా నిల్వలపై పోలీసులు దాడులు చేపట్టి, నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర ఎస్.డి.పి.ఓ యన్.బి. యం. మురళికృష్ణ  మాట్లాడుతూ నెల్లూరు పట్టణ సబ్ డివిజన్ పరిధిలోని యఫ్.సి.ఐ కాలనికి యన్.హెచ్. 16  కు మధ్యన ఉన్న ఖాళి పొలాలో కొంతమంది భారి మొత్తంలో నిషేదిత ఖైని గుట్కాలను నిల్వ ఉంచి ఉన్నారని అన్నారు. దీనికి సంబందించిన వారు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం మేరకు, నెల్లూరు ఓ.యస్.డి. క్రైమ్ టి. విఠలేశ్వరరావు,  నెల్లూరు 2టౌన్ సి.ఐ యన్. వెంకటరావు, వారి సిబ్బంది కలిసి నిషేదిత ఖైని గుట్కాల అక్రమ రవాణాను అడ్డుకుంటున్న పోలీసులపై రాళ్లు విసిరి వాహనములతో ఢీ కొట్టించి విఫల హత్య ప్రయత్నం చేసి పారిపోతున్న వ్యాపారస్తులను నలుగురిని అరెస్ట్ చేసామని చెప్పారు. వారి వద్ద నుండి 63 నిషేదిత ఖైని గుట్కా బస్తాలను, 9 సెల్ పోన్లు, 4 బైక్స్, 1 కారును, సుమారు 45 లక్షల రూపాయలు విలువచేసే నిషేదిత ఖైని గుట్కా ప్యాక్ట్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

SHARE

LEAVE A REPLY