ఎన్ సి సి ” ఏ ” సర్టిఫికెట్ పరీక్ష

0
128

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ # – నెల్లూరు నవాబు పేటలోని ఆర్ ఎస్ ఆర్ మునిసిపల్ పాఠశాలలో గురువారం ఎన్ సి సి ” ఏ ” సర్టిఫికెట్ కోసం అర్హత పరీక్ష నిర్వహించారు. ఎన్ సి సి 24 (ఏ ) బెటాలియన్ నిర్వహించిన ఈ పరీక్షలో 5 స్కూల్స్ కె ఎన్ ఆర్, సి బి ఎన్ కె, అక్షర విద్యాలయ, సి బి ఎన్ ఆర్, ఆర్ ఎస్ ఆర్  పాల్గొన్నాయి. సుబేదార్ మేజర్ ఎస్ ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షల్లో 360 మార్కులకు రాత పరీక్ష . ఉదయం 7 గంటలనుడి 10 గంటలవరకు నిర్వహించారు. 11 నుండి 2 గంటలవరకు డ్రిల్ టెస్ట్ , ఎఫ్ సి \ బి సి టెస్ట్ ,వెపన్ టెస్ట్, మ్యాప్ రీడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్షర విద్యాలయం నుండి 50 మంది ఎన్ సి సి ద్యార్థులు పాల్గొనగా వీరిలో 30 మంది బాలురు,20 మంది బాలికలు పాల్గొని ,అక్షర విద్యాలయ ఎన్ సి సి కేర్ టేకర్ ప్రసాద్ శిక్షణలో తమ ప్రతిభను ప్రదర్శించారు.

SHARE

LEAVE A REPLY