జైళ్ళను తనిఖీ చేసిన జాతీయ మహిళా కమీషన్ సభ్యులు

0
156

Times of Nellore ( Nellore ) – జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు సుష్మా సాహూ నెల్లూరులోని జైళ్ళను తనిఖీ చేశారు. నెల్లూరులోని పినాకిని అతిధి గృహంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా ఖైదీలు ఉన్న జైళ్ళలో నిబంధనల ప్రకారం సౌకర్యాలు ఉన్నాయా అని పరిశీలించడం ఈ తనిఖీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. మా పరిశీలనలో ఖైదీలకు ఏర్పాటు చేయావల్సిన సౌకర్యాలు అందడం లేదన్నారు. మహిళా ఖైదీలకు వైద్య సదుపాయం కోసం ఒక డాక్టర్ ను ఏర్పాటు చేసి ఉన్నారని, పురుషులకు, స్త్రీలకు అదే డాక్టర్ వైద్యం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఒక నర్స్ ను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా శిక్షపడిన ఖైదీలకు తెల్ల చీరను ఇస్తున్నారని, ఇది వంచితులు మాత్రమే తెల్లచీర ధరిస్తారని, అది ప్రకృతి ధర్మం అని, మహిళా ఖైదీల విషయంలో చీరల రంగు మార్చాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని జాతీయ మహిళా కమీషన్ కు సీఫార్సు చేస్తానని తెలియజేశారు. అనంతరం ఓంగోలు నుంచి వచ్చిన తమ్మిశెట్టి రమాదేవి మాట్లాడుతూ.. క్షణికావేశంలో నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, తమ కుటుంబాలకు దూరమై బాధపడుతున్నారని అన్నారు.

SHARE

LEAVE A REPLY