ప్రపంచంలోనే అరుదైన, ప్రమాదకరమైన ఆపరేషన్ విజయవంతంగా చేసిన నారాయణ వైద్యులు

0
486

Times of Nellore ( Nellore ) – నెల్లూరులో ఓ మహిళ జీవితంలో వెలుగులు నింపిన నారాయణ ఆసుపత్రి న్యూరోసర్జన్లు.. ప్రపంచంలోనే అరుదైన, ప్రమాదకరమైన ఆపరేషన్ ను విజయవంతంగా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కోట మండలం, వాకాడుకు చెందిన షేక్.మాబూబి (84) అనే మహిళ కంటి చూపు తగ్గడం, తీవ్రమైన తలనోప్పితో కంటి డాక్టరును సంప్రదించగా, కంటి డాక్టరు పరీక్షించి, కంటి నరం దెబ్బతిన్నదని, దీనికి తలలో గడ్డ కారణమైఉండవచ్చునని, న్యూరోసర్జన్ ను సంప్రదించమని సలహాఇచ్చారు. బెంగుళూరులోని ప్రముఖ న్యూరోసర్జన్ వద్ద చూపించగా డాక్టరు ఎమ్ఆర్ఐ పరీక్ష నిర్వహించి, తలలో క్యాల్ సిపైడ్ మెనింజియోమా అను గడ్డ ఉన్నదని, అది పూర్తిగా రాయిలాగా మారిపోయి కంటి చూపునకు సంబంధించిన ఆప్టిక్ నర్వను, కెరోటిడ్ అను రక్తనాళమును పూర్తిగా కప్పివేసినదని, ఆపరేషన్ అవసరమని, ఆపరేషన్ చేసినా టేబుల్ మీదే ప్రాణం పోయే అవకాశం ఉందని, ఆపరేషన్ కు లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పారు. ఖచ్చితమై అభిప్రాయం చెప్పడంతో నెల్లూరు, చెన్నైలో పలువురు డాక్టర్లను సంప్రదించగా వారు కుడా అదే సమాధానం చెప్పడంతో కుంగిపోయి మహిళ చివరికి ప్రయత్నంగా నారాయణ ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగంలోని డా. జి. విద్యాసాగర్ సంప్రదించారు. ఆయన ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, ఇతి అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ అయినప్పటికి నారాయణలో ఉన్న అధునాతన న్యూరోనావిగేషన్, ఇంట్రాఆపరేటివ్ మానిటరింగ్, ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ సహాయంతో ఆపరేషన్ చేయడానికి విలవుతుందని తెలిపారు. ఆ సమాధానంతో ఊరట పొందిన రోగి కుటుంబ సభ్యులు వెంటనే ఆపరేషన్ కు అంగీకరించడంతో డా. విద్యాసాగర్ ఆమెకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం మూడో రోజే ఆమె సాధారణ స్థితికి చేరుకుని కంటిచూపును పొందడమే కాకుండా, 20 సంవత్సరాలుగా పడుతున్న ఆరోగ్య వేదనకు ఉపశమనం పొందటంతోపాటు తన పనులు తాను చేసుకుంటుందని డా. జి. విద్యాసాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈ వో డా. సతీష్, ఎన్టీఆర్ వైద్య సేవా పథకం జిల్లా కో-ఆర్డినేటర్ డా. దయాకర్, హాస్పిటల్ ఏజీఎం సి.హెచ్ భాస్కర్ రెడ్డి, మార్కెటింగ్ హెడ్ కె. సత్యనారాయణ పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY