పక్షవాత రోగికి పునర్జన్మ ప్రసాదించిన నారాయణ హాస్పిటల్ వైద్యులు

0
263

Times of Nellore ( Nellore ) – నెల్లూరు ప్రాంతానికి చెందిన సందీప్(25) అనే యవకుడికి ఈ నెల 8వ తేదీన పక్షవాత లక్షణాలు అనగా మూతి వంకరపోవుట, మాట స్పష్టత కోల్పోవుట మరియు కుడి కాలు చచ్చుబడి పక్షవాతానికి గురికావడంతో అదే రోజు నారాయణ హాస్పిటల్ లోని ఎమర్జెన్సీ విభాగానికి తీసుకురావడం జరిగింది. న్యూరాలజీ విభాగంలో డా. ఎన్.ఎస్ సంపత్ కుమార్ ఆ యువకుడిని పరీక్షించి వెంటనే 8 గంటలకు ఆ యువకుడికి త్రోంబలైటిక్స్ ఇంజక్షన్ తో చికిత్స చేశారు. 8.45 నిమిషాలకు ఆ యువకుడు సాధారణ స్థితికి రావడం, సాధారణంగా మాట్లాడడం, మూతి వంకర సరికావడం, కుడికాలు, కుడి చేయి సాధారణ స్థితికి వచ్చి వెంటనే లేచి నడవడం జరిగింది.

ఈ సందర్భంగా డా. ఎన్. ఎస్. సంపత్ కుమార్ మాట్లాడుతూ.. ఇంత సత్వర ఉపశమనం కలగడానిక కారణం పక్షవాతం వచ్చిన వెంటనే అనగా 2 గంటలలోపు రోగిని హాస్పిటల్ కు తీసుకువస్తే ఈ అధునాతన చికిత్సా పద్దతి ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పక్షవాతం నుంచి విముక్తి కల్గించి కొద్ది సమయంలోనే సాధారణ స్థితికి తీసుకురావచ్చని తెలిపారు.

ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. శ్రీరాంసతీష్, సిఈవో డా. విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో పక్షవాతం వస్తే కొన్ని నెలలు పాటు రోగి ఇబ్బంది పడవలసి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, అందుకు వారి కుటుంబ సభ్యులు చేయవలసింది రోగిని రెండు మూడు గంటలలోపు అసుపత్రికి తీసుకురావాలని, అలా తీసుకువస్తే ఈ అధునాతన చికిత్సా పద్దతి ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే రోజు తన దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ అధునాతన చికిత్సా పద్దతి ద్వారా సందీప్ కు పక్షవాతం నుంచి ఉపశమనం కలిగించినందుకు డా. సంపత్ కుమార్ బృందాన్ని ఈ సందర్భంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సి.ఓ.ఓ బి. గిరీష్ బాబు, ఏజీఎం భాస్కర్ రెడ్డి, మార్కెటింగ్ హెడ్. కె. సత్యనారాయణ పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY