సింహపురి సోగ్గాడికి నటి రోజా షాక్ !!

0
3271

Times of Nellore ( Hydarabad ) – సింహపురి సోగ్గాడు, నెల్లూరు పెద్దారెడ్డిగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం లేని వ్యక్తిగా, అందరికీ సుపరిచితుడుగా ఉండే ఆనం వివేకానందరెడ్డికి, సినీనటి, వైసిపి ఎమ్మెల్యే రోజా షాకిచ్చింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆనంపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు ఆనంకు నోటీలుసు జారీ చేసింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే… ఇటీవల పలు సందర్భాల్లో ఆనం వివేకానందరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును రోజా తిట్టినప్పుడల్లా, వివేకానందరెడ్డి కూడా నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి అదే రేంజ్ లో రోజా పై ఎదురుదాడికి దిగేవారు. ఈ క్రమంలో వైసిపి పార్టీ నెల్లూరుజిల్లాకు చెందిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వివేకాపై హైదరాబాద్ లోని నాంపల్లి న్యాయస్థానంలో పిటిషన్ ను దాఖలు చేశారు. రోజా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆనం పై చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి వివేకానందరెడ్డికి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ ఆరోపించిన దానిపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఇంతకీ స్టైల్ ఆఫ్ సింహపురి ఆనం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరీ !!

SHARE

LEAVE A REPLY