ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నగదు మంజూరు చేస్తామని మోసం చేస్తున్న ఆన్లైన్ మోసగాడు అరెస్ట్!!

0
71

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎదురుచూసే వారి నుండి ఆన్ లైన్ లో పోస్టులు పెట్టి ఫండ్ ఇప్పిస్తానని మోనం చేసి, వారి వద్ద నుండి ఆన్ లైన్ లో డబ్బులు వసూలు చేసే న్థించితుని నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నెల్లూరు నగరంలోని స్థానిక నవాబుపేట పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర డి ఎస్.పి. శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్ చెందిన షేక్ సైలాఫ్ తండ్రి ఖాజామోహిద్దీన్, తన కుమారునికి బ్రెయిన్ సంబంధిత వ్యాధి చికిత్స నిమిత్తం అయిన 4 లక్షల రూపాయల నగదుకు తనకు 10 వేల రూపాయలు ఇస్తే, ఆన్ లైన్ ద్వారా పోస్టులు పెట్టి సి.ఎం.ఆర్.ఎఫ్. నుండి 1,50,000 రూపాయలు ఇప్పిస్తానని సత్యరాజుపల్లి సందీప్ కుమార్ రెడ్డి తండ్రి వేమారెడ్డి ఆన్ లైన్ ద్వారా సైలాఫ్ నుండి 5,100 రూపాయలు వసూలు చేశారని తెలిపారు. అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సైలాఫ్ కు ఫోన్ చేసి తన కుమారుడి గురించి విచారించే నేపధ్యంలో వారికీ, సందీప్ కుమార్ రెడ్డి కి ఎటువంటి సంబంధం లేదని తెలువగా, నవాబుపేట పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేశారన్నారు. ఎస్.పి. భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్.పి. వెంకటరత్నం పర్యవేక్షణలో నవాబుపేట సి.ఐ. వేమారెడ్డి ఎస్.ఐ.లు రమేష్ బాబు, శివప్రకాష్ ల సాయంతో సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సి.ఐ. వేమారెడ్డిని, డి.ఎస్.పి., ఎస్.పి. అభినందించారు.

SHARE

LEAVE A REPLY