మోడీ – పకోడి… నెల్లూరులో నిరసన

0
421

Times of Nellore ( Nellore ) – నెల్లూరు లో టీఎన్ ఎస్ ఎఫ్ నాయకులు ప్రత్యేక హోదా కోసం ధర్నా చేపట్టారు. మోడి – పకోడి అంటూ పకోడి వేస్తూ విఆర్సీ సెంటర్ లో విన్నూత రీతిలో విద్యార్థులు, నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి మోడీ అన్యాయం చేసాడని, ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు పోరాటాలు కొనసాగుతాయని అన్నారు. ప్రధాన మంత్రి హోదాలో మోడీ పార్లమెంట్లో ఉద్యోగాలు లేకుంటే పకోడి వ్యాపారం చేసుకోవచ్చని పరిహాసం చేసారని, అందుకు నిరసనగా రోడ్డు మీద పకోడి అమ్ముకుంటున్నామని అన్నారు. అనంతరం జై మోడీ, జై జై పకోడి అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగుల సర్టిఫికేట్ల కాపీలతో పొట్లాలుగా కట్టి పకోడిని అమ్మారు.

SHARE

LEAVE A REPLY