వైసిపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆనం విజయకుమార్ రెడ్డి

9
28270

Times Of Nellore (Nellore)-నెల్లూరుజిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి త్వరలో జరగనున్న ఎన్నికలకు తమ అభ్యర్ధిని ఖరారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆనం విజయకుమార్ రెడ్డి ని తమపార్టీ అభ్యర్ధిగా నిలబెట్టాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ లోని జగన్ నివాసంలో ఈ అంశంపై చర్చ జరిగింది. జగన్, వైవి సుబ్బారెడ్డి, నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ లు అభ్యర్ధి ఎంపికపై చర్చించారు. చివరకు ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆనం విజయకుమార్ రెడ్డి ని బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం గానీ, రాత్రికి గానీ ఆనం విజయకుమార్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డి ప్రకటించనున్నారు.

సోదరులతో విభేదించి, వైసిపీలో చేరిన ఆనం విజయకుమార్ రెడ్డికి నెల్లూరులో మంచి పట్టుంది. పై పెచ్చు ఆనం మార్కు కూడా ఉండటంతో స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్న అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినప్పటికీ తన ఉనికిని చాటేందుకు వైసిపి తమ అభ్యర్ధిని రంగంలోకి దించింది. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకాతో విజ‌య‌కు కొంత‌మేర మ‌న‌స్ప‌ర్ధ‌లు ఉన్న‌ప్ప‌టీకీ రామనారాయణరెడ్డితో సంబంధాలు బాగున్నాయి. తెదేపాలో ఉన్న రామనారాయణరెడ్డికి ఎలాగూ పోటీ చేసే అవకాశం లేదు. దీంతో కనీసం సోదరుడికి ఆర్థికంగా కొంత సాయం చేసి బరిలో దింపితే ‘భవిష్యత్తు’లో ఎమ్మెల్సీ కుటుంబంలో ఒకరికి వరిస్తుందన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయ‌న అనుచ‌రులు చ‌ర్చించుకుంటున్నారు.

ఆనం మార్క్..
ప్ర‌భుత్వాలు ఏవైనా అధికారం మాత్రం త‌మ‌ చేతిలోనే ఉండాల సిద్దాంతాన్ని ఆనం కుటుంబం మొద‌టి నుంచి ఫాలో అవుతుంది. దానిక‌నుగుణంగానే రాష్టంలో వ్య‌తిరేక ప్ర‌భుత్వం ఉన్న‌ప్ప‌టికీ జిల్లాలో ఆనం మార్కు రాజ‌కీయాలు న‌డుస్తూనే ఉంటాయి.. ఆనం సోద‌రులంద‌రూ ఒక్కోక్క‌రు ఒక్కో పార్టీలో ఉన్నా అధికారం మాత్రం త‌మ హ‌స్త‌గ‌తం అవ్వాల‌నుకుంటారు..టీడీపీ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డికి ఎమ్మెల్సీ అవ‌కాశం ఇవ్వ‌క‌పోతే వైకాపా త‌ర‌పున బ‌రిలో దిగే సోద‌రుడు విజ‌య‌కుమార్ రెడ్డికి ఆనం అంత‌ర్గ‌తంగా మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశాలు సైతం లేక‌పోలేద‌నేది జిల్లా చ‌ర్చ‌..

ఎమ్మెల్సీ వైపు వైసీపీ అనుహ్య అడుగులు…
వైసీపీ త‌ర‌పున ఆనం విజ‌య‌కుమార్ రెడ్డిని బ‌రిలో దింప‌డంలో వైసీపీ వ్యూహాత్మ‌కంగా ఆలోచించింది. ఆనంవిజ‌య కుమార్ రెడ్డి జిల్లాలో ప‌ట్టున్న నాయ‌కుడు అయిన‌ప్ప‌టికీ ఆనం మార్కు ఉండ‌టం, సోద‌రుల‌కు కూడా స్నేహ హ‌స్తం అందించే అవ‌కాశం ఉండ‌టంతో గెలిచి అవ‌కాశాలున్నాయ‌ని వైసీపీ ఆలోచిస్తుంది..దీనికి తోడు విజ‌య‌కుమార్ రెడ్డి వివాదర‌హితుడుగా ఉండ‌టం, మాజీ మంత్రి ఆనం రామనారాయ‌ణ‌రెడ్డితో స‌న్నిహిత సంబంధాలు ఉండ‌టం వైసీపీ ప్ల‌స్ అవుతోంద‌ని భావిస్తోంది..

SHARE

9 COMMENTS

LEAVE A REPLY