ఎమ్మెల్యే కురుగొండ్ల vs కార్పొరేటర్‌ రాజానాయుడు

0
3637

Times of Nellore ( Nellore ) – నెల్లూరులోని చైతన్యపురిలో టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అద్దెకుంటున్న ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కురుగొండ్ల అద్దెకుంటున్న ఇంటిని టీడీపీ కార్పొరేటర్‌ రాజానాయుడు కొనుగోలు చేశారు. ఈ ఇంట్లో గత కొంత కాలంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అద్దెకు ఉంటున్నారు. ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత ఖాళీ చేయాలంటూ రాజానాయుడు ఎమ్మెల్యే రామకృష్ణను కోరారని, కొంత గడువు కావాలని ఆయన అన్నాడని చెబుతున్నారు. అయితే కొనుగోలు చేసి చాలాకాలమైనా కురుగొండ్ల ఇళ్లు ఖాళీ చేయకపోవడంతో రాజా నాయుడు ఈరోజు ఉదయం ఆ ఇంటి వద్దకు పోయి ఇల్లు తన స్వాధీనంలోకి తెచ్చుకోడానికి ప్రయత్నించాడు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీసులు ఆ ఇంటివద్ద మోహరించారు. ఓ దశలో రాజానాయుడు, పోలీసులకు వాగ్వివాదం జరిగింది. చట్టప్రకారం ఇల్లు స్వాధీనం చేసుకోవాలని ఇలా దౌర్జన్యం చేస్తే తాము ఒప్పుకోమని పోలీసులు చెప్పడంతో రాజా నాయుడు తన ఇంట్లోకి తాను పోయేందుకు ఎలా అడ్డగిస్తారంటూ వాదనకు దిగారు. పోలీసులు మాత్రం సమస్యను సామరస్యంగా చట్టపరంగా పరిష్కరించుకోవాల్సిందేనని చెప్పుకొచ్చారు.

SHARE

LEAVE A REPLY