దివ్యాంగులకు ట్రైసైకిళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

0
131

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం దివ్యాంగులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ట్రైసైకిళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రభుత్వ సహకారంతో, స్వర్ణభారత్ ట్రస్ట్, జిల్లా పరిషత్, తన స్నేహితులు, దాతల సహాయ సహకారాలతో ఇబ్బటి వరకు షుమారు 500 మందికి పైగా వికలాంగ సోదరులకి టై సైకిళ్ళు, హ్యాండ్ స్టిక్ లు, వినికిడి యంత్రాలు మొదలగు పరికరములు అందించడం జరిగిందని అన్నారు. ఆపదలో ఉన్నవారికి, అనాధలకి మనం అండగా నిలిస్తే, ఆ భగవంతుడు మన కుటుంబాలకి అండగా నిలుస్తాడని, తనకు అత్యంత తృప్తి నిచ్చేది సామాజిక సేవా కార్యక్రమాలన్నారు. ఎక్కడైన సరే రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసి, సమాజంలో మనసున్న దాతలను తాను ప్రత్యేకంగా కోరుతున్నది ఏమనగా సామాజికి సేవా కార్యక్రమాలు చేపడితే దానిలో ఉన్న తృప్తి దేనిలో ఉండదని, మన కుటుంబాలలో వివాహాలు, జన్మదినాలు మొదలగు శుభకార్యములు జరుగునప్పుడు అనేక లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటామని, దివ్యాంగుల కోసం, అనాదల కోసం కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టాలని కోరారు.

SHARE

LEAVE A REPLY