జనం అల్లాడుతుంటే చోద్యం చూస్తున్నారా ? అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

0
212

Times of Nellore ( Nellore ) – 366 రోజుల ప్రజా ప్రస్థానంలో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం 19వ డివజన్, రామలింగాపురంలో పర్యటించారు. గత రాత్రి రామలింగాపురం వాసులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఫోన్ చేసి, కలుషిత నీళ్ళతో త్రాగునీరు, డ్రైనేజ్ నీరు కలిసి పోవడంతో తాము పడుతున్న ఇబ్బందులను ఫోన్ లో వివరించారు. గత రాత్రి స్థానికులు చేసిన ఫోన్ కాల్ కు స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈ రోజు ఉదయం నగర కార్పోరేషన్, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులను తీసుకొని ఇంటింటికి తిరిగి, కలుషిత నీళ్ళ సమస్యని తెలుసుకున్నారు. వారం రోజులుగా కలుషిత నీళ్ళతో జనం అల్లాడుతుంటే చోద్యం చూస్తున్నారా అంటూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో కలుషిత నీళ్ళ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని అధికారులు ఇచ్చిన హామితో రూరల్ ఎమ్మెల్యే శాంతించారు. అదే విధంగా జగన్స్ కాలేజ్ ముందు త్రవ్వేసి వదిలేసిన ఖాళీ గుంటను పబ్లిక్ హెల్త్ అధికారులకు చూపించి, ఈ గుంటలో ఈ వర్షాకాలంలో ప్రజలు పడితే దానికి బాధ్యత ఎవరని ప్రశ్నించారు. ఈ రోజు సాయంకాలంలోపు జగన్స్ కాలేజి ముందు ఉన్న గుంటను పూర్తిగా పూడుస్తామని, అదేవిధంగా శ్రీహరి నగర్ లో త్రాగునీటి సమస్య ఈరోజే పరిష్కరిస్తామని అధికారులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్పష్టమైన హామీ ఇచ్చారు. చెప్పిన మాట నిలబెట్టుకోకుంటే చూస్తూ ఊరుకోనని, అదే సమయానికి మళ్ళీ ఈ ప్రాంతానికి స్వయంగా వస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెేల్చి చెప్పారు. ఫోన్ చేసిన 12 గంటలలోపు స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని స్థానికులు అభినందించారు.

SHARE

LEAVE A REPLY