68 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్ళు అందిస్తున్న ఎమ్.పి మేకపాటి అభినందనీయుడు – ఎమ్మెల్యే కోటంరెడ్డి

0
297

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం 5 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్ళు అందించారు. వనంతోపులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్.పి. మేకపాటి రాజమోహన్ రెడ్డి చొరవ, సహకారంతో ఇది సాధ్యమైందని, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 68 మంది దివ్యాంగులకు ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి బ్యాటరీ ట్రైసైకిళ్ళు అందిస్తున్నారని, ఒక్కొక్కటి 37వేలు రూపాయలు విలువ చేస్తుందని, ఇందులో ఎమ్.పి గ్రాంటు క్రింద 12వేలు, కేంద్ర ప్రభుత్వం సంస్థల సహకారంతో మరో 25వేల రూపాయలతో ఇది సాధ్యమైందని, ఇందుకు చొరవ తీసుకున్న ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గత నాలుగేళ్ళగా దాతల, స్వచ్ఛంద సేవా సంస్థల, అధికారుల, ప్రభుత్వాల సహకారంతో 500 మంది దివ్యాంగులకు తగిన సహకారం అందించినట్లు, ఇందుకు సహకరించిన అందరికీ దన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

విలువలకు కట్టుబడ ఎమ్.పి మేకపాటి..
దివ్యాంగుల బ్యాటరీ ట్రైసైకిళ్ళు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్.పి మేకపాటి ని ఆహ్వానించారని, అయితే ప్రత్యేక హోదా సాధనకోసం తాను ఎమ్.పి గా రాజీనామా చేశానని, వారు ఆమోదించినా, ఆమోదించకున్నా నేను ఎమ్.పి కానని, అందుకే నైతికంగా ఈ కార్యక్రమానికి హాజరుకావడం ధర్మం కాదని, అలాగని దివ్యంగులకి పంపిణీ కార్యక్రమం ఆగకూడదని, దానికి వెంటనే జరిపించాలని చెప్పారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పారు. ఇంతటి నైతిక విలువలకు విశ్వసనీయతకు కట్టుబడ ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆదర్శం హర్షణీయమని, అందరికీ మార్గదర్శకం అని అన్నారు.

SHARE

LEAVE A REPLY