దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో రాజన్న కంటి వెలుగు – ఎమ్మెల్యే అనీల్

0
811

Times of Nellore ( Nellore ) – సంక్షేమ ప్రదాత దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో మోడర్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో రాజన్న కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని నగర ఎమ్మెల్యే డా. పి. అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 40, 41 డివిజన్ వాసులకు మూలాపేటలోని ఈ.యస్.ఆర్.యం. మునిసిపల్ హైస్కూల్ నందు జరిగిన రాజన్న కంటి వెలుగు (ఉచిత కంటి వైద్యశిబిరం) కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదవారు ఆర్ధిక పరిస్థితి బాగలేక వైద్యులను సంప్రదించక ఇబ్బంది పడుతుండడంతో ఈ కార్యక్రమము ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితముగా కంటి అద్దములు, అవసరమైనవారికి కంటి ఆపరేషన్ లు కూడా ఉచితముగా చేయడం జరుగుతుందన్నారు. నెల్లూరు నగరములో నవంబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో కార్పోరేటర్ గోగుల నాగరాజు, యం.డి. ఖలీల్ అహ్మద్, నాయకులు వడ్లమూడి చంద్ర, కుంచాల శ్రీనివాసులు, పూజారి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY