ఎన్టీఆర్ బయోపిక్ గురించి మంత్రి సోమిరెడ్డి కామెంట్స్

0
190

Times of Nellore (నెల్లూరు)# కోట సునీల్ కుమార్ # : మహానుభావుడు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు చిత్రాన్ని నెల్లూరులోని ఎస్2 థియేటర్ లో రాష్ట్ర మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జెడ్ శివప్రసాద్, నాయకులు వీక్షించారు. ఈ చిత్రం గురించి మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ మహనీయమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎన్టీఆర్..ఆయన హీరోయిజాన్ని, ప్రజలపై ఆయనకున్న అంకితభావాన్ని వెండితెర మీద దర్శకుడు క్రిష్ అద్భుతంగా చూపించారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ జీవించారు. ఎన్టీఆర్ జీవించివున్నట్టుగానే అద్భుతమైన సినిమా తీసిన బాలకృష్ణకు నా ప్రత్యేక అభినందనలు. బాలకృష్ణ, కళ్యాణ్ రాంతో పాటు నటీనటులందరినీ అభినందిస్తున్నా అన్నారు. ఎన్టీఆర్ తో నాకు ఎంతో అనుబంధం ఉంది..ఆయన దగ్గర జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను, ఎన్టీఆర్ అభిమానంగా రెండు మాటలు మాట్లాడితే జీవితాంతం గుర్తుండిపోతాయి, సారా వ్యతిరేక ఉద్యమ సమయంలో మా ఇంట్లో బస చేశారు..ఆ సమయంలో మా కుటుంబసభ్యుల్ని ఆయన అభినందించడం జీవితాంతం గుర్తుండిపోయే సందర్భం అన్నారు. కథానాయకుడు అద్భుతంగా ఉంది..మహానాయకుడు చిత్రం కూడా ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూసే పరిస్థితి తెప్పించారు.

SHARE

LEAVE A REPLY