విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న మంత్రి నారాయణ – ఎమ్మెల్యే అనిల్

0
536

Times of Nellore ( Nellore ) – మంత్రి నారాయణ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నారని, నారాయణ విద్యాసంస్థల మాఫియా తో మధ్యతరగతి ప్రజల్ని దోచుకుంటోందని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరు రాజన్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో అందరికీ ఒకే నిబంధనలు ఉండాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్ ఫీజు 2,800 రూపాయలు మించకూడదని ఉన్నా.. రకరకాల పేర్లతో విభాగాలు పెట్టి నారాయణ కాలేజీ విద్యార్థికి సంవత్సరానికి 3లక్షల రూపాయలకు పైగా ఫీజులు వసూలు చేస్తోందని పేర్కొన్నారు. ఫీజులు కట్టే విధానాన్ని బట్టి విద్యార్థులను విభజించి వారికి విద్య నేర్పించడం సరికాదన్నారు. ఇలాంటి వ్యవస్థను దోపిడి అంటారా? లేక నిజాయితీ గల సేవా అంటారా అని మంత్రి నారాయణ ను ప్రశ్నించారు. పేదవాడు, ధనవంతుడు అని చూడకుండా విద్యను అందరికి సామానంగా విద్యను అందించాలని అన్నారు. ఇంతా దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వంలో ఉండి ప్రైవేట్ దోపిడీకి పాల్పడుతు, ఈ రాష్ట్రంలో కార్పొరేట్ మాఫియా ను నడుపుతున్నారని అన్నారు. నారాయణ ఫీజులపై కలెక్టర్ కి, ఆర్ఐఓకి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కోర్టుకు సైతం వెళ్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY