మంత్రి అనిల్‌కు అభినందనలు!

0
110

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –రాష్ట్ర జలనవరుల శాఖామంత్రి డాక్టర్‌ పీ అనిల్‌కుమార్‌యాదవ్‌కు ఇరిగేషన్‌ శాఖ ఎన్జీవో అసోసియేషన్‌ నాయకులు అభినందనలు తెలిపారు. అసోసియేషన్‌ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నాయుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అనిల్‌కుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పిలుపు మేరకు పూల బొకేలు, శాలువాలు కాకుండా పేద విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు మంత్రికి అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ మార్కెండేయులు, గౌరవాధ్యక్షుడు థామస్‌ రాజు, సహాధ్యక్షుడు రమే్‌షబాబు, ఉపాధ్యక్షుడు చెంచురాజు, సంయుక్త కార్యదర్శి శీనయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌, అసోసియేషన్‌ నాయకులు శేషయ్య, నాగరాజు, సుబ్బరాయుడు, చెంచయ్య, వెంగయ్య, రత్నం తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY