గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం

0
232

Times of Nellore (Nellore) – కౌండిన్య హెల్త్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేసి అభినందించే కార్యక్రమం ఆదివారం ఉదయం టౌన్‌హాల్‌లో నిర్వహిస్తున్నామని ఆ ట్రస్టు గౌరవాధ్యక్షుడు తాతా నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అన్నం దయాకర్‌ గౌడ్‌ తెలిపారు. వేదాయపాలెంలోని గౌడ సంఘ కార్యాలయంలో శుక్రవారం వారు ప్రతిభా పురస్కారాలకు ఎంపికై విద్యార్థుల వివరాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత కార్మికుల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని 9వ దఫా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది పదిలో 8.5 గ్రేడ్‌ పాయింట్లుపైన, ఇంటర్‌లో 900 మార్కుల పైన సాధించిన విద్యార్థులు 250 మందికి ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారన్నారు. వారికి ప్రశంసా పత్రం, పతకం, జ్ఞాపిక, నగదు బహుమతిని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఏపీ గౌడ సంఘ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, అడిషనల్‌ ఎస్పీ శరత్‌బాబు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఉపాధ్యక్షుడు ఉదయగిరి నరసింహులు గౌడ్‌, దద్దోలు రమణయ్యగౌడ్‌, సంయుక్త కార్యదర్శి రావుల వెంకటేశ్వర్లు గౌడ్‌, కమిటీ సభ్యులు దద్దొలు చక్రపాణిగౌడ్‌, రావుల కేశవులు గౌడ్‌, అలపాక రత్నం గౌడ్‌, ఉదయగిరి శ్రీనివాసులు గౌడ్‌, బండ్ల రామాంజనేయులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY