మెగా కోడలు ఉపాసన జన్మదిన వేడుకలు

0
57

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-   సామాజిక సృహతో మెగా కోడలు ఉపాసన చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్భంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చిన్నారులకు పండ్లు, నిత్యవసర వస్తువులు అందచేశారు.అనంతరంఆయన మీడియాతో మాట్లాడుతూ
మనసున్న మహారాజు రాంచరణ్ కు భార్యగా,
“సమాజమే దేవాలయం గా” భావించి ఉపాసన చేస్తున్న సేవా కార్యక్రమాలు ద్వారా మెగా అభిమానుల అందరి అభిమానం సంపాదించిదన్నారు. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి జాతీయ స్థాయిలో అవార్డులు రావడం సంతోషంగా ఉందని, ఇలాంటి పుట్టినరోజు లు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీ. హరికృష్ణ, ప్రశాంత్, బాలాజీ, యువ, నాగులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY